ఐరన్ లోపం జుట్టు రాలడానికి ఒక కారణం. ఇనుము సమృద్ధిగా ఉండే ఆహార పదార్థాలు తీసుకుంటే జుట్టు చక్కగా పెరుగుతుంది. ఆరోగ్యంగా ఉంటుంది. పాలకూరతో పాటు తోటకూర,రాగులు వంటివి తప్పనిసరిగా తీసుకోవాలి. చిలకడదుంప లో విటమిన్ ఎ అధికం ఇందులో బీటా కెరోటిన్ కూడా ఉంటుంది.అలాగే అవాకాడల్లో విటమిన్ సి తో పాటు యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నాయి. జుట్టు దెబ్బతినకుండా కాపాడతాయి. ముఖ్యంగా పాలకూరలో జుట్టు పెరుగుదలకు అవసరమైన పోషకాలన్నీ  ఉన్నాయి  ఫోలెట్ ఐరన్ విటమిన్ ఎ, విటమిన్ సి వంటివి పాలకూర ద్వారా లభిస్తాయి.ప్రతిరోజు కప్పు పాలకూర తీసుకుంటే రోజుకు సరిపోయే విటమిన్- ఎ లు  సగానికి పైగా తీసుకున్నట్లే .

Leave a comment