Categories
వయసు పెరుగుతున్న కొద్దీ చిన్నపాటి అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి . వాటిని సకాలంలో సరిగ్గా గుర్తించేందుకు సరికొత్త పైజామా లు వచ్చాయి . ఈ దుస్తులు వేసుకొంటే శ్వాస వేగాన్ని గుండె పల్స్ రేటుని గుర్తిస్తాయట శరీర ధర్మాన్ని తెలుసుకో గలిగే ఈ దుస్తుల్ని ఫిజియో లాజికల్ సెన్సంగ్ టెక్స్ టైల్స్ అంటున్నారు . ఈ స్మార్ట్ టెక్స్ టైల్స్ లో పలు సెన్సార్లు ఉంటాయి . రాత్రివేళ ఇవి వేసుకొని ప్రశాంతంగా నిద్రపోయేందుకు వీలుగా ,శరీరానికి హాయిగా అనిపించే రీతిగా వీటిని తయారు చేశారు . ఈ దుస్తుల్లోని సెన్సార్లు శరీరంలోని అవయవాల పనితీరుని గుర్తించి ఫోన్ లో నిక్షిప్తం చేస్తాయి . అలా దుస్తుల ద్వారానే ఆరోగ్యాన్ని తెలుసుకోవచ్చు .