చర్మం రంగు మెరుస్తూ మృదువుగా కనిపించాలంటే ఇంట్లో వాడుకొనే పదార్ధాలు ఎంతో ఉపయోగపడతాయి. బొప్పాయి ముక్క మొహం పైన మృతకణాలు పోగొట్టి మరింతగా మెరిపిస్తుంది. పావు కప్పు బొప్పాయి గుజ్జు,పావు కప్పు పైనాపిల్ గుజ్జు కలిపి మాస్క్ వేసినా మంచి ఫలితం ఉంటుంది. చక్కెర వినియోగం తగ్గిస్తే మొహం పట్టులా చక్కగా మెరుస్తూ వుంటుంది. చక్కని బాదం నూనె ఎంతో పరిశుభ్రంగా ఉంచుతోంది. చక్కని పోషక  పదార్ధాలున్నకాయగూరలు,తృణ ధాన్యాలతో చర్మం సహజసిద్దమైన మెరుపులు మెరుస్తుంది. గ్రీన్ టీ ని టోనర్ గా వాడితే కాంతిహీనంగా ఉన్న చర్మం మెరిసిపోతూ వుంటుంది పొడి చర్మం గలవాళ్ళు ఉదయాన్నే కొబ్బరి నీళ్ళు తాగుతు వుంటే చర్మం తేమగా తయారవుతోంది. పుచ్చ,కమలా,అవకాడో వంటి పండల్లో చర్మానికి కావలసిన తేమ అందుతోంది.

Leave a comment