కోవిడ్ నుంచి కోలుకున్నంత మాత్రాన గండం గట్టెక్కినట్లు రిలాక్స్ అయి పోకూడదు,మరోసారి కోవిడ్ కు గురికాకుండా రక్షణ చర్యలు కొనసాగించాలి అంటున్నారు డాక్టర్లు.కోవిడ్ నుంచి పూర్తిగా కోలుకున్న తర్వాత కొంతకాలం పాటు నీరసం నిస్సత్తువ వేధించడం సహజం .జీవనశైలి మరింత మెరుగ్గా ఉంచుకుంటే ఇమ్యూనిటీ పెరుగుతుంది భోజన వేళలు నిద్రవేళ వ్యాయామ వేళలు సక్రమంగా పాటిస్తే పూర్వపు ఆరోగ్యాన్ని సమకూర్చుకోవటం సులభం. ప్రతిరోజూ కాస్త దూరం నడవాలి తేలికైన వ్యాయామాలు చేయాలి. నిద్రపోవటం మనస్సు శాంతిగా ఉంచుకోవటం కోసం శ్రావ్యమైన సంగీతం వినాలి. ఒత్తిడి పెంచే ఆలోచనలు జ్ఞాపకాలు మనసు లోకి రానివ్వకూడదు. పచ్చని ప్రకృతిలో వీచే గాలిని ఆస్వాదిస్తూ కొంత సమయం గడిపితే మేలు.

Leave a comment