ఇంత అందమైన కురుల కోసం మీరేం శ్రద్ధ తీసుకుంటారు అని ఒక అభిమాని అడిగిన ప్రశ్నకు అవకాడో హెయిర్ మాస్క్ వేసుకుంటాను అని సమాధానం ఇచ్చింది జాన్వికపూర్. అవకాడో గుడ్డు తేనె కలిపిన ఈ మాస్క్ ఎలా తయారు చేసుకోవాలో ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది జాన్వీకపూర్. అవకాడో ఒక సగం ముక్క టేబుల్ స్పూన్ తేనె ఒక గుడ్డు నచ్చిన ఎసెన్షియల్ ఆయిల్ తీసుకోవాలి, అవకాడో ముక్కని మెత్తగా పేస్టులాగా చేసి తేనె ఎసెన్షియల్ ఆయిల్ కలిపి ఆ మిశ్రమాని గిలకొట్టిన గుడ్డు కలిపి జుట్టుకు పట్టించి 20 నిమిషాల తర్వాత శుభ్రం చేసుకోవాలి . అవకాడో లోని సహజ నూనెలు పాలీ ఆన్ సాచురేటెడ్ మెనో ఆన్ సాచురేటెడ్ ఫ్యాటీ ఆమ్లాలు నిర్జీవమైన కురులకు పోషణ ఇచ్చి జీవం పోసాయి అని చెప్పుకొచ్చింది జాన్వీ కపూర్ ఇది  సమ్మర్ టిప్ అంటోంది జాన్వి.

Leave a comment