Categories
ఆహారం విషయంలో పాతతరం అనుసరించిన విధానాలే మేలు అంటున్నారు నిపుణులు . క్లుప్తంగా త్రి ఈ సూత్రం పాటించాలంటున్నారు . ఈట్ సీజనల్,ఈట్ ట్రెడిషనల్ అంటున్నారు స్థానిక ఆహారాన్ని సీజనల్ ఫుడ్ ని వదలకుండా సాంప్రదాయ పద్దతిలోనే తినాలి అంటున్నారు . తినగలిగినంతే మితాహారం తినాలి. మధుమేహం ఊబకాయం ,థైరాయిడ్ సమస్యలు ఉన్నవాళ్ళు కూడా సంప్రదాయ ఆహారం తీసుకొంటేనే మేలు అంటున్నారు . స్వచ్ఛమైన నెయ్యి ,తాలింపు కోసంవాడే ఆవాలు ,జీలకర్ర,మెంతుల ,ఇంగువ ,లవంగాలు వెల్లుల్లి దాల్చిన చెక్క అల్లం వంటి దినుసులు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి . అలవాటుగా తినే ఇడ్లీ లు కొన్ని గంటలు నిల్వ చేస్తాము కనుక పెర్మేంటిడ్ ఆహారం గా మరి జీర్ణ వ్యవస్థలోని బాక్టీరియా కు మేలు చేస్తాయంటున్నారు .