భారతీయ వంటకాల్లో సాధారణంగా వాడే మసాలా దినుసుల్లో ఆరోగ్యాన్ని మెరుగుపరిచే సుగుణాలు ఎక్కువే. బిరియానీ ఆకులో విటమిన్-ఎ,సి ఫోలిక్ యాసిడ్ ఇతర పోషకాలు పుష్కలంగా ఉండటం వల్ల జీర్ణవ్యవస్థ పనితీరు బావుంటుంది.యాలకుల్లో బలవర్ధకమైన యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. పసుపు లో యాంటీ ఆక్సిడెంట్స్ ఫ్రీరాడికల్స్ ఉండటం వల్ల జలుబు, దగ్గు ను నివారించగలుగుతుంది. మిరియాల లో ఉండే సుగుణాలతో రక్తప్రసరణ క్రమబద్ధీకరణ జరుగుతోంది. వీటిని బ్లాక్ గోల్డ్ అంటారు. మెగ్నీషియం, ఐరన్, పొటాషియం, ఫైబర్ లు ఎక్కువ. కొవ్వును కరిగించడం తో పాటు మెటబాలిజం ను పెంచుతాయి జలుబు, గొంతు నొప్పికి మంచి మందు. అల్లం తేనెతో కలిపి తీసుకుంటే గొంతు నొప్పి తగ్గుతుంది. వీటిలో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ యాంటీ ఇన్ ఫ్లమేటరీ గుణాలు చర్మ ఇన్ఫెక్షన్లను తగ్గిస్తాయి. దాల్చిన చెక్క పాస్టింగ్ బ్లడ్ గ్లూకోజ్ కొలెస్ట్రాల్ ను నియంత్రణలో ఉంచుతుంది. మెదడు పనితీరు మెరుగుపరచగలుగుతోంది. ఎండుమిర్చి విటమిన్-సి పుష్కలంగా దొరుకుతోంది. జీలకర్ర ను ఆహారంలో గానీ పానీయంగా గానీ తీసుకొంటే దీనిలోని యాంటీ ఇన్ ఫ్లమేటరీ గుణాలు జీర్ణ సమస్యలను నియంత్రించటంతో పాటు గుండె మంటను తగ్గిస్తాయి. వంటల్లో ఇవన్నింటినీ ప్రతి రోజు వాడటం వల్ల సహజంగానే రోగనిరోధక శక్తి మెరుగ్గా ఉండటంతో సాధారణమైన సీజనల్ వ్యాధులు కూడా రాకుండా ఆరోగ్యంగా ఉంటారు అందుకే భారత దేశపు వంటకాలు ప్రపంచవ్యాప్త ప్రసిద్ది చెందాయి.

Leave a comment