Categories
Wahrevaa

హార్ట్ ఫ్రెండ్లీ ఆహారం ఇది.

తినే ఆహారం ఆకలి మాత్రమే కాక హృదయానికి ఆరోగ్యం ఇచ్చేదిలా వుండాలి. బాక్సడ్ పదార్దాలు ఎంతో తక్కువగా కొంటె అంత మంచిది. ప్రోసెస్డ్ పదార్ధాలు సాధారణంగా బాక్స్ లో ర్యాప్ చేసి లేదా బ్యాగ్సలో లభిస్తాయి. వీటిలో ఫిటో నుట్రియంట్స్ బాగా తక్కువగా ఉంటాయి. ఆహారంలో ఎన్నో రంగుల కురగాయల్ని చేర్చితే అంత బలం ఇస్తాయి. రంగుల కురగాయల్లో గుండెకు ఆరోగ్యాన్నిచ్చే యాంటీ ఆక్సిడెంట్స్ లభిస్తాయి. పండ్లు, కూరగాయలు రంగుల్లో అనేక విభిన్నతలు ఉంటాయి. రంగుల కూరలు పండ్లు తింటూ వుంటే హార్ట్ ఫ్రెండ్లి లక్షణాలు వంట బట్టించుకున్నట్లే రోజుకు ఒక టీస్పూన్ కంటే తక్కువ సోడియం సరిపోతుంది. రక్త పోటు వుంటే ఉప్పువాడకం తగ్గించక పొతే రక్తపోటు నియంత్రణలో వుండదు. పొటాషియం అధికంగా వుండే పదార్దాలు తినాలి ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ అనేక రకాల చేపలలో ఉంటాయి వారంలో రెండుసార్లయినా చేపలు తినాలి.

 

Leave a comment