సౌందర్యసాధనాల ప్రపంచంలో తిరుగు లేని మహారాణి షహనాజ్ హుస్సేన్.ఆమె పేరే ఒక బ్రాండ్ 1979లో షహనాజ్ హుస్సేన్ కోల్కతాలో ప్రారంభమైంది.కాస్మెటిక్ తెరఫీ కాస్మెటాలజీ లో శిక్షణ పొందిన షహనాజ్ పేరుపైన ప్రస్తుతం 7000 ఫ్రాంచైజ్ క్లినిక్ లు 800 డిస్ట్రిబ్యూషన్ పార్టనర్లు, 70 బ్యూటీ  శిక్షణ అకాడమీ లు ఉన్నాయి.140 దేశాలకు ఆమె ఉత్పత్తులు విస్తరించాయి. ఒక వ్యాపార ప్రకటన కూడా లేకుండా తన పేరు పైన అన్ని ఉత్పత్తులు అమ్మే షహనాజ్ కు ఇటు హాలీవుడ్ తారలు,అటు వ్యాపారవేత్తల వరకు ఎంతోమంది కస్టమర్స్ గా ఉన్నారు.ఆయుర్వేద మూలికల నుంచి చర్మ సౌందర్య ఉత్పత్తులను తయారు చేసిన షహనాజ్ హుస్సేన్ ను హెర్బల్ క్వీన్ గా పిలుస్తారు.

Leave a comment