ఈ ఎండల్లో తేలికగా జీర్ణమై పోషకాలను అందించ గలిగేది ఆకుకూరలే అంటారు ఎక్సపర్ట్స్. ప్రతి రోజు వందగ్రాముల ఆకుకూరలను ఆహారంలో ఉండేలా చేసుకోగలిగితే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. శరీరానికి అవసరం అయ్యె సూక్ష్మ పోషకాలు ఆకుకూరల్లో ఉంటాయి. తోట కూర,గోంగూర,కరివేపాకు లో ఎక్కువ మొత్తంలో పీచు ఉంటుంది. తోటకూరలో విటమిన్ ఎ,బి,మెగ్నీషియం పొటాషియం,సెలీనియం,పీచు ఉంటాయి. పాలకూర లో ప్రోటీన్,పీచు,విటమిన్ ఎ ఇనుము ఉంటాయి. పొన్నగంటి కూరలో జుట్టుకు పోషణ ఇచ్చే బయోటిన్ సంవృద్ధిగా ఉంటుంది. చింతచిగులులో మాంసకృత్తులు జింక్ సెలీనియం రోగ నిరోధకతను పెంచే విటమిన్-సి అధిక మొత్తంలో ఉంటుంది. ఆకుకూరలను నీళ్ళలో బాగా కడిగి తడి ఆరేలా తుడిచి వేర్లను కట్ చేసి టిష్యు పేపర్ లోనో,మందమైన వస్త్రంలోనో చుట్టి ఆరబెట్టుకోవాలి.
Categories