లాక్ డౌన్ లో కొంచెం ధైర్యం, నమ్మకం మనసులో నింపుకునేందుకు Home stories చూడండి అంటూ నెట్ ఫ్లిక్స్ ఈ నాలుగు కథలు సినిమాను యు ట్యూబ్ లో రిలీజ్ చేసింది. మొదటి కథ ఔట్ విత్ ఇట్ ఒక యువకుడు యాంగ్జైటీ డిజార్డర్ తో బాధపడుతూ ఉంటాడు ఫ్లాట్ నుంచి బయటికి వస్తే ఊపిరి ఆగిపోతుంది అనుకుంటాడు.ఎలాగైనా బయటికి రావాలి అనే ప్రయత్నంలో ఆల్ లైన్ లో సైకియాట్రిస్ట్ సాయం కూడా తీసుకుంటూ ఉంటాడు.ఒక ఎగ్ బాక్స్ నీ డోర్ బయట ఉన్నదని తెచ్చుకుందామని ఎంతో ప్రయత్నం చేస్తాడు.ఎలాగో బయటికి వచ్చే సరికి తలుపు గబుక్కున పడిపోయి లాక్ అవుతుంది. బయటపడ్డ అబ్బాయికి ఊపిరి ఆగిపోవటం ఏమి జరక్క అంతా హాయిగా ఉంది అనుకుని బయటకు వస్తాడు తీరా బయటకు వస్తే బయట అంతా నిర్మానుష్యం.ముందు రోజే కోవిడ్ భయంతో లాక్ డౌన్ అతను భయాన్ని జయించాడు, ఈ లాక్ డౌన్ ను మాత్రం జయించ లేరా? అని కధ ముగిస్తుంది. ఇంకా మూడు చక్కని కథలు ఉన్నాయి చూడండి యూట్యూబ్ లో !
Categories