లాక్ డౌన్లో ఎన్నో కొత్త సమస్యలు వస్తున్నాయి ముఖ్యంగా గృహ హింస పెరిగిపోయిందని తాజా రిపోర్టులు చెబుతున్నాయి.బాధ్యత మహిళలు ఇప్పుడు లాక్ డౌన్ కారణంగా ఇల్లు కదిలే వీలే లేదు పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేసే అవకాశం లేనే లేదు. ఈ పద్ధతిని గమనించిన రాయపూర్ పోలీసులు ‘ చుప్పీ టోడ్ ‘ పేరుతో స్పెషల్ డ్రైవ్ మొదలు పెట్టారు అంటే నిశ్శబ్దాన్ని ఛేదించండి అని అర్థం.ఒక ఫోన్ నెంబర్ ను అందుబాటులోకి తెచ్చారు. ఈ నెంబర్కు ఫోన్ చేయవచ్చు, లేదా వాట్సాప్ లో వివరాలు పంపవచ్చు సమాచారం అందగానే పోలీస్ లు ఇంటికి వస్తారు. గృహహింస పాల్పడ్డ భర్తకు కుటుంబ సభ్యులకు ముందుగా కౌన్సెలింగ్ ఇస్తారు. వినకపోతే కేస్ ఫైల్ చేస్తారు. రాయపూర్ పోలీసులు చొరవతో వేలాది మంది స్త్రీలు రక్షణ పొందారు.

Leave a comment