ఆడవాళ్ళ ను శరీరాకృతి తోనే గుర్తించే మగవాళ్ళను ఎదుర్కొనేందుకు ఆడవాళ్ళం సిగ్గుపడతాం కానీ ఈ తరహా బాడీ షేమింగ్ ను ఇన్నాళ్లు భరించాం ఇక చాలు అంటుంది నాగిని సీరియల్ నటి టీవీ నటి సయంతాని ఘోష్ ఒక ఇంటర్వ్యూలో ఒకతను నా బ్రా కొలత అడిగాడు ఆడవాళ్ల ఛాతిలో ప్రత్యేకత ఏముంది. అది ఒక శరీర అవయవం. పాలిచ్చే తల్లికి ఆ అవయవం అవసరం అనుభవంలోకి వస్తుంది. ఇలా శరీరం తీరు గురించి మాట్లాడితే మౌనంగా ఉండి పోవద్దు. శరీరాన్ని మనసునీ దృఢంగా మార్చుకోండి. ఇది అన్ని రకాల శరీర ఆకృతులను ఒకేలా చూసే సమయం అంటోంది తనకు ఎదురైన అనుభవాన్ని గురించి సోషల్ మీడియా వేదికగా బదులు ఇచ్చారు సయంతాని ఘోష్ .

Leave a comment