ఇండియన్ ట్రాక్ ఆర్ట్ ఆకర్షణీయమైన రంగులతో అందమైన అక్షరాలు ఇమేజెస్ తో కళ్ళను ఆకర్షించేలా ఉంటుంది. రోడ్లపైన ఆగి ఉన్న ట్రాక్స్ చూస్తే వాటి పైన వేసిన పెయింటింగ్స్ నడిపే డ్రైవర్లకు చూసే వాళ్ళకు మనస్సుకు ఉత్సాహం వేసే రంగులు బొమ్మలతో ఉంటాయి. అదే బొమ్మలను చీరెల పైకి తెస్తే ఎలా ఉంటుందో ప్రయోగం చేసింది ఫ్యాషన్ డిజైనర్ ఐశ్వర్య రవిచంద్రన్. ‘హార్న్ ఓకే ప్లీజ్’ పేరుతో తెచ్చిన చీరెలు సేంద్రియ మస్లిన్ ఫ్యాబ్రిక్ తో బయో డిగ్రేడబుల్ రంగులతో అద్భుతంగా ఉన్నాయి. ఇండియన్ ట్రాక్ ఆర్ట్ ప్రేరణతో వచ్చిన ఈ తొమ్మిది రకాల చీరెలు దేనికదే ప్రత్యేకం.

Leave a comment