కొండల్లోంచి వీరావేశంతో దుకే జలధారల్ని చూసి ఉంటాం . వీటిని జలపాతాలని పిలుస్తాం ,కానీ కాలిఫోర్నియా లోని హార్స్ టైల్ జలపాతం వీటికి బిన్నంగా ఉంటుంది . యాప్ మైట్ జాతీయ పార్కులు 1500 అడుగుల ఎత్తునుంచి దూకుతున్న ఈ జలపాతంలో నీళ్ళు ఫిబ్రవరి నెలలో ఇలా అగ్నికీలల్లా కనిపిస్తాయి . అగ్ని పర్వతం పై నుంచి లావా కరిగి జారుతోంది అనిపిస్తుంది . సాయం సమయంలో ఎరుపు ,నారింజ రంగుల్లో అగ్ని మంటల్లా కనిపించే ఈ జలపాతాన్ని చూసేందుకు సందర్శకులు వస్తారు . ఇంతకీ ఇది అగ్ని ప్రవాహం కాదు . కరిగిడు మంచు జారుతూ ఉంటే  వాటిపైన సంధ్య కిరణాలు పడి ఆ మంచునీళ్ళు అగ్ని కణాల లా  కనిపిస్తుంటాయి . ప్రకృతి చూపించే అద్భుతాల్లో ఇదొకటి .

Leave a comment