Categories
పొడి చర్మం అయిటే హాట్ ధెరపీ చాలా బాగా ఉపయోగ పడుతుందని బ్యూటీ ఎక్స్ పర్ట్స్ చెప్పుతున్నారు. పొడి చర్మాన్ని మృదువుగా మార్చాలంటే ప్రతి రోజు ఉదయం వెచ్చని నీళ్ళు చేతిలోకి తీసుకుని మొహాన్ని అందులో మునిగేలా చేయడం గా హాట్ ధెరఫీగా చెప్పుతున్నారు. ఉదయం సాయంత్రం ఇలా హోట ధెరఫీ చేస్తే మంచి ఫలితం వుంటుంది. అలాగే కోడి గుడ్డు సోనలో ఓ టీ స్పూన్ కమలారసం ఓ టీ స్పూన్ ఆలివ్ ఆయిల్, నాలుగైదు చుక్కల పన్నీరు అంటే మోతాదులో నిమ్మరసం తీసుకుని వీటిని చాలా కలిపి మొహానికి పట్టిస్తే ఇది పొడి చర్మానికి మాయిశ్చురైజర్ గా పని చేస్తుంది. అలాగే బాగా మగ్గిన అరటి పండు చిదిమి మొహానికి పట్టించి పది నిమిషాల తర్వాత కడిగేస్తే చాలు మొహం మెరిసిపోతుంది.