ఏవియేషన్ ఇది హైదరాబాద్ డొమినియన్స్ పుస్తకంలో దేశం లో తొలి వైమానిక చరిత్ర రచయిత్రిగా ఘనత కెక్కారు అనురాధ పింగ్లె రెడ్డి. భారత జాతీయ సంస్కృతి వారసత్వ సంస్థ’ (ఇంట్యాక్) గవర్నింగ్ కౌన్సిల్‌కి జీవితకాల సభ్యురాలు. నిజమ్స్ డక్కన్ ఎయిర్ వేస్ చరిత్ర గురించి చెన్నయ్,ముంబయ్,ఢిల్లీ నగరాల్లో అందులో పని చేసిన వారందరినీ కలిపి అప్పటి ఫర్మానాలు,డాక్యుమెంట్స్ సంపాదించి,ఆ సమాచారంతో ఈ పుస్తకం రాశారు అనురాధ ఎవి ఆయిల్ సంస్థ దీన్ని ముద్రించింది. ఇప్పటి తెలంగాణా చాప్టర్ కో-కన్వీనర్‌గా హైదరాబాద్‌కు ఇంట్యాక్ కన్వీనర్‌గా నగర చారిత్రక విశేషాలను యువతరానికి పరిచయం చేసేందుకు సుమారు వందకు పైగా హెరిటేజ్ క్లబ్స్, ప్రతి నెలా హెరిటేజ్ వాక్స్ నిర్వహిస్తున్నాం అంటారు అనురాధ పింగ్లె రెడ్డి. తెలంగాణా చారిత్రక కట్టడాల గురించి వివరించింది,అందుకు సంబంధించిన ఫోటోలు భద్రం చేయటం నాకు ఇష్టం అంటారామె.
Categories