ఇప్పుడు అమ్మాయిల ఫ్యాషన్ ట్రెండ్ మోనో క్రోమాటిక్ స్టయిల్ అంటే ఒకే రంగు, కానీ వేర్వేరు ఛాయల్లో డ్రెస్ కుట్టిస్తారు. లేత నీలివర్ణం లేహంగా కుట్టేస్తే, బ్లవుజు ముదురు రంగులో దుపట్టా ఇంకాస్త లేత ఛాయలు, అంటే పైనుంచి కింది వరకు ఒకే వర్ణం కానీ వారె ఛాయల్లో కనిపిస్తాయన్నమాట. సంప్రదాయ డ్రెస్సులకు లేదా పాశ్చాత్య వస్త్ర శ్రేణికి ఈ ట్రెండ్ బాగానే వుంటుంది. ప్లీటెడ్ చీరలు, లేహంగాలు, అనార్కలి గౌన్ లు, ధోతీలు, ఫ్యాంట్లు వేటినైనాసరే మొనోక్రోమాటిక్ లో ఎంచుకోవచ్చన్నమాట. ఇవి సన్నగా ఉన్నవారికి స్టైలిష్ లుక్ ఇస్తే లావుగా ఉన్నవారికి స్టైలిష్ లుక్ ఇస్తే లావుగా ఉన్నవారికి సన్నగా కనిపించేలా చేస్తాయి. యాంటిక్  సిల్వర్ తరహ నగలు వేసుకుంటే చక్కగా కనిపిస్తారు.

Leave a comment