నీహారికా, ఎంతోసేపు ఫేస్ బుక్ లోనే ఉంటున్నాను, వదలలేను, టైమ్ గడిచిపోతుంది అంటున్నావు. ఇవ్వాల్టి యువతకు ఫస్ట్ ప్రాబ్లమ్ ఇదే. స్నేహితుల్ని కోరుకుంటారు యువత, సరే, ఫేస్ బుక్ మిత్రులు నిజమైన మిత్రులు కాదు అంటోంది ఒక అధ్యయనం. ఎందుకంటే వాళ్ళు వ్యక్తిగతంగా కలవలేదు, స్నేహంతో సన్నిహితంగా మెలగలేదు కనుక, ఎఫ్ బి కేవలం టైం కిల్లింగ్ కోసమే అంటారు పరిశోధకులు. జీవితంలో ఇంతగా మమేకమైన ఎఫ్.బి. వదిలేందుకు, ఆ అలవాటు తప్పించేందుకు నిపుణులు కొన్ని సూచనలు చేశారు. ఫేస్ బుక్ అకౌంట్ క్లోజ్ చేయండి. ఖచ్చితంగా దాన్ని చూడను అని నిర్ణయం తీసుకోండి. ఫేస్ బుక్ కారణం గా కోల్పోతున్న గంటలన్నీ, సంతోషాన్ని, సరదాలని ఒక పేపర్ పైన నోట్ చేసుకోవాలి. ఫేస్ బుక్ చూడాలనిపించినప్పుడల్లా ఈ పేపర్ ఒకసారి చూడమంటున్నారు. వీలైతే ఇంటర్నెట్ కనెక్షన్ తొలగించండి అంటున్నారు. ఫేస్ బుక్ ద్వారా పంచుకొనే కబుర్లని ఇంట్లో సభ్యులతోనో, దగ్గరగా వుండే ఒకరిద్దరు స్నేహితులతోనో షేర్ చేయండి అంటున్నారు. ఇంటర్నెట్ అనేది ఒక అపురూపమైన నెట్ వర్క్. సరిగ్గా ఉపయోగించుకొంటే అదొక పెద్ద గ్రంధాలయం, డిక్షనరీ, ఇన్ఫర్మేషన్ సెంటర్. దాని దుర్వినియోగం చేసుకొంటే అదొక విష వలయం. విజ్ఞతతో మనకు అందుబాటులోకి వచ్చిన విజ్ఞానాన్ని సద్వినియోగం చేసుకోవాలి/ ప్రతి చిన్న సందేహానికి సమాధానం ఇంటర్నెట్ తో అనుసంధానమైన సెర్చ్ ఇంజన్. దేన్నయినా తెలివిగా వాడుకోవాలి.
Categories
Nemalika

తెలివిగా వాడుకొంటే అది అపురూపం

నీహారికా,

ఎంతోసేపు ఫేస్ బుక్ లోనే ఉంటున్నాను, వదలలేను, టైమ్ గడిచిపోతుంది అంటున్నావు. ఇవ్వాల్టి యువతకు ఫస్ట్ ప్రాబ్లమ్ ఇదే. స్నేహితుల్ని కోరుకుంటారు యువత, సరే, ఫేస్ బుక్ మిత్రులు నిజమైన మిత్రులు కాదు అంటోంది ఒక అధ్యయనం. ఎందుకంటే వాళ్ళు వ్యక్తిగతంగా కలవలేదు, స్నేహంతో సన్నిహితంగా మెలగలేదు కనుక, ఎఫ్ బి కేవలం టైం కిల్లింగ్ కోసమే అంటారు పరిశోధకులు. జీవితంలో ఇంతగా మమేకమైన ఎఫ్.బి. వదిలేందుకు, ఆ అలవాటు తప్పించేందుకు నిపుణులు కొన్ని సూచనలు చేశారు. ఫేస్ బుక్ అకౌంట్ క్లోజ్ చేయండి. ఖచ్చితంగా దాన్ని చూడను అని నిర్ణయం తీసుకోండి. ఫేస్ బుక్ కారణం గా కోల్పోతున్న గంటలన్నీ, సంతోషాన్ని, సరదాలని ఒక పేపర్ పైన నోట్ చేసుకోవాలి. ఫేస్ బుక్ చూడాలనిపించినప్పుడల్లా ఈ పేపర్ ఒకసారి చూడమంటున్నారు. వీలైతే ఇంటర్నెట్ కనెక్షన్ తొలగించండి అంటున్నారు. ఫేస్ బుక్ ద్వారా పంచుకొనే కబుర్లని ఇంట్లో సభ్యులతోనో, దగ్గరగా వుండే ఒకరిద్దరు స్నేహితులతోనో షేర్ చేయండి అంటున్నారు. ఇంటర్నెట్ అనేది ఒక అపురూపమైన నెట్ వర్క్. సరిగ్గా ఉపయోగించుకొంటే అదొక పెద్ద గ్రంధాలయం, డిక్షనరీ, ఇన్ఫర్మేషన్ సెంటర్. దాని దుర్వినియోగం చేసుకొంటే అదొక విష వలయం. విజ్ఞతతో మనకు అందుబాటులోకి వచ్చిన విజ్ఞానాన్ని సద్వినియోగం చేసుకోవాలి/ ప్రతి చిన్న సందేహానికి సమాధానం ఇంటర్నెట్ తో అనుసంధానమైన సెర్చ్ ఇంజన్. దేన్నయినా తెలివిగా వాడుకోవాలి.

Leave a comment