కరోనా సోకిందని తెలిసినప్పుడు నేనేమి భయపడలేదు ఎప్పటిలాగే వ్యాయామాలు చేశాను పౌష్టికహారం తీసుకున్నాను. కుటుంబ సభ్యులం మాస్క్, గ్లౌజులు, సాక్స్ ధరించి భౌతిక దూరం పాటించాలి పదిహేను రోజులపాటు హోమ్ క్వారంటైన్ చేశాం. నేను సాధన చేసే యోగ ప్రక్రియల్లో శాంభవీ మహా ముద్రను ఏడేళ్లుగా చేస్తున్నాను ఆ క్రియల ప్రభావం నా శరీరం మనసు పైన ఉంది అలాగే కరోనా నుంచి బయట పడ్డాను అంటోంది ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ హైదరాబాద్ కు చెందిన శిల్పా రెడ్డి.ఈమె ఒకప్పటి మిసెస్ ఇండియా…కరోనా ఎవరికైనా ఎప్పుడైనా సోకవచ్చు అవగాహన,అప్రమత్తతలు వ్యాధి సోకగానే భయాందోళనకు గురి కాకుండా ఆత్మబలంతో ఉండండి అంటుంది శిల్పా రెడ్డి ఆరోగ్యకరమైన జీవన శైలిలో కరోనా పైన విజయం సాధించవచ్చని నిరూపించిన అనుభవంతో ఈ వ్యాధి పట్ల అవగాహన ఏర్పర్చి  ప్రజలను చైతన్య వంతులను చేయాలనే ఇంస్టాగ్రామ్ లో వీడియో ఉంచాను అంటుంది శిల్పా రెడ్డి.

Leave a comment