Categories
కాలేజీలో చదువుతున్న రోజుల నుంచి మోడలింగ్ లో ఉన్నా. అదే సినిమాల్లో అవకాశం రావటానికి హెల్ప్ అయింది. ప్రతి క్లాస్ లోను ఫస్ట్ వచ్చేదాన్ని. ఇంజీరింగ్ లో గోల్డ్ మెడల్ తీసుకున్నాను. ఐ ఎ ఎస్ చెద్దామని నా గోల్ అటు కాకుండా ఇటు కాకుండా సినీరంగంలోకి వచ్చాను అంటుంది. సాక్షి అగర్వాల్. రజనీ కాంత్ కాలా సినిమాతో అందరి దృష్టిలోకి వచ్చింది సాక్షి. They are with us అన్న హాలీవుడ్ సినిమాల్లో కుడా నటించింది. నేను తమిళ అమ్మాయిని కనుక కొలీవుడ్ లో భాష సమస్య కాలేదు. బెంగుళూరు లో చదివాను కనుక కన్నడ సినిమాలకు కష్టపడలేదు. ఇప్పుడిక దక్షినాదిలో అవకాశాలు వస్తున్నాయి భాష నేర్చేసుకుని ఇక తెలుగులో చేస్తాను అంటుంది సాక్షి.