Categories

వర్షాల్లో వ్యాయామం మూల పడచ్చు. అలా బ్రేక్ పడకుండా ఇతర పనుల్లో వ్యాయామం పూర్తి చేయండి అంటున్నారు ఎక్సపర్ట్స్. ఉదయం సాయంత్రం ఇల్లు శుభ్రం చేయచ్చు. కారు కడగచ్చు, బైక్ శుభ్రం చేయచ్చు, తోట పని చేయచ్చు అలాగే బట్టలు ఉతకటం ఆరేయడం మడతలు పెట్టటం కూడా మంచి వ్యాయామం దానితో ఒకేసారి భిన్నమైన కండరాలు పనిచేస్తాయి వెన్ను వంగకుండా నిటారుగా కూర్చోవడం కూడా వ్యాయామం కిందికే వస్తుంది. పనిలో డ్రైవింగ్ లో, డైనింగ్ టేబుల్ దగ్గర నిటారుగా కూర్చోవడం అలవాటు చేసుకోవాలి పిల్లలతో సమయం గడపటం ఆడటం అయితే అద్భుతమైన వ్యాయామం.