Categories
నేను పుట్టి పెరిగిందంతా నిజామాబాద్. ముస్లిం కుటుంబం కావడంతో ఎన్నో ఆంక్షలు ఉండేవి కానీ. బాక్సింగ్ నా కల. నా జీవితం, నేను ఎప్పుడు ఇంకో విషయం ఆలోచించలేదు. నీ వల్ల ఏమవుతుంది అని నన్ను తీసిపారేసిన చోటే వరల్డ్ ఛాంపియన్ గా నిలబడటం నా విజయం అంటోంది నిఖత్ జరీన్. మేరీకోమ్ నాకు ఆరాధ్య దైవం ఆమె స్ఫూర్తి అంటున్న నిఖత్. సల్మాన్ ఖాన్, అల్లు అర్జున్, రామ్ చరణ్ ఫ్యాన్ నాని చెబుతోంది. ఒత్తిడి కలిగిందంటే వాళ్ళ సినిమాలు చూస్తా వరల్డ్ ఛాంపియన్ షిప్ క్వార్టర్స్ లో గెలిచాక తగ్గేదేలా అంటూ అల్లు అర్జున్ మేనరిజం ట్రై చేస్తే చెప్పలేనంత ఫాలోయింగ్ వచ్చింది. నిజంగానే ఎప్పుడూ తగ్గేదే లేదు. ఇది ఆరంభం మాత్రమే ఒలంపిక్స్ నా లక్ష్యం అంటుంది నిఖత్ జరీన్.