Categories
బీబ్ జువెలరీ గా ఫేమస్ అయ్యాయి గవ్వల నగలు ఫ్యాషన్ జ్యువెలరీ గా సాంప్రదాయ ఆభరణంగా అన్ని వేడుకల్లో వెలిగిపోతున్నాయి గవ్వలు. జడలో మల్లెలు గా మెడలో హారాలు గా రంగు తాళ్లతో కలిసి అందమైన ఆభరణం లాగా చక్కగా ఉంటున్నాయి గవ్వల నగలు. బ్లౌజ్ కు లెహంగా లకు ఎంబ్రాయిడరీ లు గవ్వలు జత చేరి మరింత ఆకర్షణీయంగా కనిపిస్తున్నాయి. డిజైనర్ డ్రస్ లతో మిర్రర్ వర్క్ తో పాటు గవ్వలు కలిసి మరింత అందంగా కనిపిస్తున్నాయి చూడ చక్కని లెహంగాలు ఎంబ్రాయిడరీ వర్క్ పైన గవ్వల కూర్చు తో మెరుస్తున్నాయి. ఆధునిక వస్త్రధారణలో అద్భుతంగా కలిసిన గవ్వల నగలు ఖరీదు కూడా చాలా తక్కువ తోనే ఉన్నాయి.