ఇప్పుడు ఇరవై  ఎళ్ళే కదా ఇప్పుడెం వ్యయామం ఇంకో ఐదేళ్ళు పోయాక చూద్దాం అనుకుంటే ప్రాబ్లం అంటున్నారు ఫిట్ నెస్ ఎక్స్ పర్ట్స్. ముప్పై దాటాక బరువు పెరిగి అప్పుడు తీరైన శరీరం కోసం కష్టపడిన ప్రయోజనం ఉండదు. పెద్దగా బాద్యతలు బరువులు లేని ఇరవయ్యేళ్ళ వయస్సులో చేసె వ్యయామానికి శరీరం చక్కగా సహకరించడమే కాకుండా వ్యయామం జీవితాంతం జీవన శైలిలో భాగంగా ఉంటుంది. ఈ వయసులో ఏ రకమైన వ్యయామం అయిన చేయవచ్చు. ఈ వయసులో వ్యయామం వల్ల కండరాలు చక్కగా వృద్ది చెందుతాయి. కోవ్వు దరి చేరకుండా ఉంటుంది. నడకతో పాటు పుష్ అప్స్,చిన్ అప్స్ ,స్క్వాట్స్ మంచి వ్యయామం అంటున్నారు ఫిట్ నెస్ ట్రైనర్స్.

Leave a comment