సందర్భాన్ని బట్టి దుస్తులు. పెళ్ళిళ్ళు, పండగలు ప్రేత్యేకం. జరీ పట్టు దుస్తులే బావుంటాయి. అలంకరించిన వేదికలు, అత్తరు, పన్నీరు సువాసనలతో వాతావరణంలోనే ఒక ప్రత్యేకత. ఆ సందర్భానికి సరిగ్గా సరిపోయేది ఆకట్టుకొనే రంగుల్లో కనువిందు చేసే పట్టు వస్త్రాలే. ఇప్పుడ కంచి పట్టు సరసన వచ్చి నిలబడింది ఇకత్. నేత డిజైన్ లకు ఎంబ్రాయిడరీ సోయగం తోడైతే మరీ మెరుపులు, భారీ డిజైన్ లు కాకుండా ఇకత్ పూల సౌందర్యం సంప్రదాయ డిజైన్ లు, మోడరన్ లుక్ తో ఏ వయస్సు  వారికైనా కత్తి పడేస్తుంది. సిల్క్ లాగా తేలికైన ఇకత్ చీరలు అన్ని వర్ణాలలో కనువిందు చేస్తున్నాయి.

Leave a comment