ఇల్లు శుబ్రం చేసేందుకు, మంచి సువాసన తో ఉంచేందుకు, క్రిములు లేకుండా చేసేందుకు ఎన్నో రకాల ఖరీదైన లిక్విడ్స్, లోషన్స్ బజార్లో దొరుకుతాయి. అంత ఖర్చు లేకుండా ఇంట్లో వుండే కొద్ది పాటి వస్తువులతో ఇల్లు మెరిసిపోయేలా పరిమళాలు వచ్చేలా క్లీన్ చేయొచ్చు. టైల్స్ శుబ్రం చేయాలంటే బేకింగ్ సోడా రెండు భాగాలు, ఒక భాగం వేనిగర్, నిమ్మరసం వేసి కలిపి ఈ మిశ్రమంలో బట్టను ముంచి టైల్స్ పైన రాసి పది నిమిశాలుంచి తర్వాత కడిగేయాలి. ఇదే మిశ్రమాన్ని డ్రైనేజ్ షింక్, బాత్ రూమ్ కు వడోచ్చు. అలాగే ఆలివ్ నూనె, నిమ్మరసం ఒక్క భాగం చొప్పున తీసుకుని కలపాలి. ఈ మిశ్రమాన్ని చెక్క ఫర్నిచర్ పైన పూయడమో లేదా స్ప్రే బాటిల్ లో చల్లడమో చేయాలి. త్వరగా పొడి బట్టతో తడిస్తే బావుంటాయి. అలాగే మంచి అలాగే మంచి సువాసన కోసం, వేడి నీళ్ళు, వైట్ వేనిగర్, ఎనస్తీషియల్ ఆయిల్ ఏదైనా సరే తీసుకోవాలి. వేడి నీళ్ళల్లో ఏడెనిమిది స్పూన్ల వెనిగర్ కలిపి అందులో టి ట్ర్రీ, లవెండర్ లేదా లెమెన్ గ్రాస్ ఎసెంషియల్ నునేల్ని వేస్తె ఇల్లంతా శుబ్రంగా వుండటం తో పాటు మంచి సువాసనలు వస్తాయి.
Categories