Categories
వర్షాకాలం మొదలైతే దగ్గు, గొంతు ఇన్ఫెక్షన్ లు ఎక్కువ అవుతాయి. రోగ నిరోధక శక్తిని పెంచే ఆహారం తీసుకుంటూ హెర్బల్ టీ, వేడి నీరు తాగుతూ జింక్ ఫుడ్ ఆయిల్ ఫుడ్ కి కాస్త దూరంగా ఉండమన్నారు డాక్టర్లు. దోమల మూలంగా మలేరియా, డెంగ్యూ జ్వరాలు వస్తాయి. గోరువెచ్చని నీళ్లు మాత్రమే తాగాలి. ముసురు పట్టిన రోజుల్లో ఆకుకూరలు, కూరగాయలు బాగా శుభ్రం చేసుకోవాలి. అప్పుడప్పుడే చేసిన భోజనం వేడిగా ఉండగానే తినేయాలి. వర్షంలో తడిస్తే వెంటనే పొడి బట్టలు మార్చుకోవాలి పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలి.