బరువు పెరగటం ,వాయుకాలుష్యం ,కొన్ని దురాలవాట్లు కారణంగా ఆయుఃప్రమాణం తగ్గిపోతుందన్నది ఎప్పుడో తెలిసిన విషయమే. ఇప్సుడు వచ్చిన ఒక కొత్త పరిశోధన, ఒంటరిగా జీవించటం .సామాజిక సంబంధాలు లేకపోవటం కూడా వ్యక్తులు తొందరగా మరణించేందుకు కారణమౌతుందని తేల్చింది. ఒంటరిగా జీవించే వారి ఆయుఃప్రమాణం 65కి మించి లేదంటున్నారు. మనుష్యులు చక్కగా అనుబంధాల మధ్య హాయిగా జీవించాలని కోరుకొని ఒంటరి తనాన్ని ఆహ్వానిస్తే నష్టమేనంటున్నారు .సరైన కుటుంబ సంబందాలు సామాజిక బంధాలు లేక పోతే అది వారి ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తోందని సైకాలజిస్టులు తేల్చి చెపుతున్నారు.

Leave a comment