Categories
కీర దోస,తులసి పానీయం వేసవిలో శరీరానికి చల్లదనాన్ని అందించడంతో పాటు ఇమ్యూనిటీ ని పెంచుతుందని చెపుతున్నారు ఎక్సపర్ట్స్. తయారీ కూడ చాలా తేలిక. కీరా దోస ఒకటి తులసి ఆకులు ఎనిమిది స్వీట్ సిరప్ 60 ఎం.ఎల్ ,సోడా కొద్దిగా సరిపోతాయి. ముందుగా కీరదోస పొట్టు తీసి ముక్కలుగా కట్ చేసుకోవాలి ఒక గ్లాస్ లో నీళ్ళు తీసుకుని అందులో దోస ముక్కలు వేసి బాగా కలుపుకోవాలి. ఇంకో గ్లాసులో తులసి ఆకులు తీసుకోవాలి.తరువాత అందులో స్వీట్ సిరప్ పోయాలి. ఇప్పుడు దోస ముక్కలు కలిపిన నీళ్లు పోయాలి. చివరిగా సోడా పోసి సర్వ్ చేసుకోవచ్చు.