టెన్జింగ్ నార్గే నేషనల్ అడ్వెంచర్ అవార్డ్ అందుకొంది పోలీస్ అధికారిణిగా బాధ్యతలు నిర్వహిస్తూ పర్వతారోహణ చేస్తున్న అనితా కుందు ఎలాగైనా ఏడు ఖండాల్లోని అత్యంత ఎత్తయిన పర్వత శ్రేణులను ఎక్కాలని లక్ష్యం పెట్టుకొంది.మౌంట్ నీరింగ్ లో శిక్షణ పొంది రెండేళ్లుగా ఏడు ఖండాలలో,ఆరు పర్వతారోహణ లను పూర్తి చేసింది. ఏడవ పర్వతారోహణ గా, ఎవరెస్ట్ ను నేపాల్,చైనా,రెండు వైపుల నుంచి ఎక్కింది. లాంగ్ అడ్వెంచర్ కేటగిరి లో ప్రతి సంవత్సరం క్రీడా రంగంలో సాహసాలు ప్రదర్శించేవారికి ఇచ్చే ఈ టెన్జింగ్ నార్గే నేషనల్ అడ్వెంచర్ అవార్డ్ రాష్ట్రపతి నుంచి అందుకొంది అనితా కుందు.