Categories
ప్లాస్మా దానం చేసిన తొలి వ్యక్తిగా గుర్తింపు పొందింది అహమదాబాద్ కు చెందిన స్మృతి ఠక్కర్ ప్యారిస్ నుంచి వచ్చాక పాజిటివ్ వచ్చింది. పదిహేను రోజుల చికిత్స అనంతరం కోలుకున్నాను. కరోనా బాధితులకు ప్లాస్మాథెరపీ ప్రయోజనకరంగా ఉందని చెప్పారు కరోనా నుంచి కోలుకున్న నాకు ప్లాస్మా దానం చేస్తే కరోనా బాధితులను కాపాడవచ్చు అని చెప్పారు. ప్లాస్మా ఎక్కించడం ద్వారా కరోనా బాధితులు యాంటీబాడీస్ పెరిగి రోగనిరోధక శక్తి పెరిగి కోలుకుంటారని డాక్టర్లు చెప్పారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆస్పత్రిలో ప్లాస్మా దానం చేశాను నా వల్ల ఇంకొకళ్ళు కోలుకుంటారు అంటే అంతకంటే ఇంకేం కావాలి నేనే మొదటి వ్యక్తిని కావటం చాలా సంతోషంగా ఉంది అంటోంది స్మృతి ఠక్కర్.