ఇవ్వాల రోజంతా పనే, పది నిముషాలు తీరిక లేదు, లంచ్ చేసే సమయం లేదు అంటున్నారు, అమ్మాయిలు చాలామంది కానీ ఉదయం ఏడింటికి బయలుదేరినా మీ ఫుడ్ మేఎ వెనకే వుంచుకోవాలి. మీ బ్యాగ్ లో ముందు ప్లేస్ దానికే కేటాయించాలంటున్నారు నిపుణులు. ఖచ్చితంగా ఏదన్నా తింటేనే ఎనర్జీ లెవెల్స్ సరిగ్గా వుంటాయి రోజంతా చురుకుగా వుంటారు. బరువు పెరగకుండా వుంటారు. మద్యాహ్నం బోజనంలో సాత్విక ఆహారమే వుండాలి. వేపుళ్ళు మసాలాలు లేకుండా అన్నం తో పాటురెండు పుల్కాలు, పులుసు కూర, పెరుగు వుండాలి. అదీ రోజు ఒకే వేళకి తినాలి. మద్యాహ్నం భోజనం తెచ్చుకోకుండా బయటి భోజనం కోసం చూసే వాళ్ళు పిజ్జాలు, సమోసాల వైపు చూడకుండా పండ్లు కాయగూరల ముక్కలకే ప్రాధాన్యత ఇవ్వాలి. మొలకలు, నిమ్మరసం అందుబాటులో వుంచుకోవాలి. తృణ ధాన్యాలతో చేసిన పదార్ధాలకు ప్రాధాన్యత ఇవ్వాలి. ఇక భోజనం అంటే అది ఆకు కూరలతో నే సగం నిండాలి. బఠానీలు, బీన్స్ వంటివి చేర్చి ఆకు కూరలు అధికంగా వుంటే ఆహారం తీసుకుంటే వీటిలో వుండే ప్రోటిన్ల శక్తి నిస్తాయి. ఇక భోజనం తర్వాత కాస్తాయినా నడవాలి. ఆరోగ్యంగా చురుకుగా వుండాలి అంటే ఎంత తీరిక లేక పోయినా కొన్ని నియమాలు తప్పనిసరిగా పెట్టుకోవాలి.
Categories