Categories
పిస్తా బయో షెల్స్ జ్యువెలరీ ! మీరు సరిగ్గానే విన్నారు. సలాడ్స్ లో స్వీట్లలో పాయసాల్లో వాడే పిస్తా పప్పు పైన ఉండే పొట్టు తో అందమైన జ్యువెలరీ అలంకరణ సామాగ్రీ వచ్చేసాయి. ఇంట్లోకి డెకరేషన్ పీసెస్ మెళ్లోకి నెక్లెస్ ఈ పిస్తా పొట్టు తో చేసేసారు. ఫ్లవర్ వాజుల్లో అందమైన పూవులు గోడపైన పిట్టలు ఇయర్ రింగ్స్ లాకెట్స్ చెయిన్స్ డ్రెస్ కు మ్యాచయ్యే రంగులతో ప్రెట్టీ జ్యూవెలరీ రెడీ అయింది. ఇంకా వాటిని బంగారు రంగులతో పాటు కుందన్స్ క్రిస్టల్స్ మెరుపులు జోడిస్తే కోట్ల ఖరీదు చేసే వజ్రాల నగల పక్కన సర్దుకుని నిలబడేలా ఉన్నాయి. ఇంకా ఎలాంటి వస్తువులు తయారు చేయచ్చు. వెయ్యి ఐటమ్స్ ఐడియా లో కూడా ఉన్నాయిట. ఓసారి ఆన్ లైన్ లో చూడండి. ఇవి అన్నింట్లో పెద్ద పిస్తాలే అని మీరే అంటారు.