Categories
Gagana

ఇంటి గార్డెన్ లో ముఖాకృతులు.

కళాకారుల ఊహలకు ఎప్పుడూ రెక్కలోస్తూ ఉంటాయి. వాళ్ళ భావనలో ఎప్పుడూ ఒక్క కొత్తదనం వుంటుంది. దానికి రూపం పోయడంలో ఒక్కొక్కళ్ళదీ ఒక్కో పంధా. కొందరికి తమ కళను ఇసుక తో మరల్చడం ఇష్టం. ఇంకొందరు శిల్ఫంగా ఇంకొక్కళ్ళు చిత్రంగా……. రకరకాల ప్రక్రియల్లో తమ చేతిలో వున్న కళకు ప్రాణం పోస్తారు. మిచెల్లీ ఈ కోవలో మనిషే. ఇంగ్లాండ్, బర్మింగ్ హోమ్ కి చెందిన మిచెల్లి పోలే  గార్డెనింగ్ చాలా ఇష్టం. ఎంత ఇష్టం అంటే తన గార్డెన్ లోని మొక్కల్ని మనుషుల ముఖాకృతులతో ఆమె ట్రిమ్ చేసింది. మిచెల్లి ఒక ఆర్టిస్ట్ కాబట్టి ఆమె ఇదంతా చేయగలిగింది. ఆర్టిస్ట్ కళ్ళకు ఏ వస్తువునైనా కలాత్మకమే. అందులో మీచెల్లీ ముఖాకృతులని తీర్చి దిద్దగలరు. దాంతో ఆమె తన ఇంటి గార్డెన్ మొక్కలలో తన కుటుంభ సభ్యుల ముఖాకృతులను తీర్చిదిద్దింది. ముఖ్యంగా ఆమె ఇద్దరు పిల్లాల మొహాలు కొడుకు బెన్సేన్ కళ్ళజూడు ధరిస్తారు. దాన్ని అమర్చేందుకు చాలా కష్టపడ్డారంటుంది మిచెల్లి. పనికి  రాణి ప్లాస్టిక్ తో కళ్ళ జోడు తయ్యారు చేసి కొడుకు ముఖాకృతికి అమర్చింది. అయితే ఈ చిత్ర కళలో ఒకే ఒక ఇచ్చిందిదాన్ని ఎప్పుడూ ట్రిమ్ చేస్తూ వుండాలి చెట్లు పెరుగుతాయి కదా.

Leave a comment