ఎప్పుడూ వ్యాయామం చేస్తూనే ఉన్నాం కదా, లేదా నడుస్తున్నాం కదా ఇక ప్రశాంతంగా గంటల తరబడి కుర్చుని పని చేసుకున్నా సరే టైమ్-టు డయాబెటీస్, హృదయ సంబందమైన రుగ్మతులు వచ్చే అవకాశాలు ఎక్కువగా వున్నాయనినిపుణులు హెచ్చరిస్తున్నారు. గంటల కొద్దీ డెస్క్ ముందు సెటిల్ అయ్యేవారు కొంత జాగ్రత్త తీసుకోవాలి అంటున్నారు. కాఫీ, లంచ్ బ్రేక్ లోను తప్పనిసరిగా లేచి కాసేపు నడిస్తేనే మంచిది. అలాగే గంటకొ సారి రెస్ట్ రూమ్ కి నడవండి, అదీ ఒకందుకు మంచిదే అంటున్నారు. ఫోన్ వస్తే చాలు  లేచి నిలబడి మాట్లాడతామని సహాద్యోగులతో అవసరం వస్తే  ఫోన్ చేయడం కాకుండా లేచి వెళ్లి మాట్లాడే అలవాటు చేసుకోమంటున్నారు. అదే ఇంట్లో వుండే ఆడవాళ్ళ పనయి పోగానే ఇక టి.వి ముందు రెస్ట్ తీసుకోకుండా అరగంట కొ సారి అటు ఇటు నడిచి పనులు చేసుకోవడమో, లేదా నాలుగు మెట్లెక్కి దిగడం వంటి వ్యాయామం చేయడమో మంచిదంటున్నారు.

Leave a comment