సిల్క్, షిపాన్, జెర్రీ వస్త్రాలతో పాటు బెనారస్, ఇకత్, కాటన్ మాక్సీలొస్తున్నాయి. అమ్మాయిలకు విహార యాత్రలు ఇష్టంగానే వుంటాయి. అలా లాంగ్ డ్రైవ్ కోసం మాక్సీలు క్యాజువల్ లుక్ తో స్టైల్ గా బాగుంటాయి. ఉదయం వేళ ప్రయాణాలకు మంచి పువ్వుల ప్రింట్స్ బాగుంటాయి. ప్రయాణాలకే సౌకర్యం కోసం అనుకోకుండా పార్టీ వేర్ గా అయితే మెరిసే వస్త్రం తో చేసిన మాక్సీలు ఎంచుకోవచ్చు. లేదా బెనారెస్ బ్రోకేడ్ వంటి వస్త్రాలతో రూపొందించిన మాక్సీలు కూడా మోడరన్ లుక్ తో అందంగా వుంటాయి. ఏ ఋతువులోనైనా కొత్తగాకనిపించాలి అనుకుంటే సరైన ఎంపిక మాక్సీ. ఫలానా సందర్భం అంటూ నియమం వుండదు. సాయంత్రపు వేడుకల్లోనూ కాలేజీలు కార్యాలయాలు అన్నింటికీ మాక్సీ ఓకె.

Leave a comment