చట్టం చెప్పినట్లు నడుచుకోవలసిందే లేకపోతే శిక్ష తప్పదు .ఒక్కో దేశంలో కొన్ని రకాల చట్టాలు చాలా తమషా అయినవి  ఉంటాయి .మనక్కూడా ఇలాంటివి ఉంటే బాగుండు అనిపిస్తాయి .ఇప్పుడు రకరకాల ఫ్యాషన్ చెప్పులు ధరించడం అలవాటు మ్యాచింగ్ కోసం ఎన్నో రకాల చెప్పుల్ని వాడుతూ ఉంటారు .ఇటలీ లోని క్యాప్రి ద్విపంలో ఫ్లిప్ ఫ్లోప్స్  వేసుకోవటం నిషేధం .ఇవి వేసుకొని నడిస్తే శబ్దం వస్తుందని ఆ శబ్దం ఇతరులని    ఇబ్బంది పెడుతుందని వాటిని క్యాప్రి లో నిషేదించారు .అక్కడ చెప్పులు వేసుకొని నడిస్తే ఫైన్ కట్టక తప్పదు .

Leave a comment