తల్లులు ఉద్యోగినులైతే పిల్లలు ఒక్కసారి వంటరిగా ఇంట్లో ఉండవలసి వస్తుంది. ఏ సాయంత్రమో తల్లి కంటే ముందే ఇంటికి చేరుకున్న ఆ కాసేపు వంటరిగానే ఉండాల కదా. ఆలా జరిగే అవకాశం వుంటే ముందుగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి . పిల్లలను మొదటి నుంచి ఒంటరిగా గడిపేందుకు తగిన విధంగా సిద్ధం చేయాలి. కుటుంబ సభ్యుల ఫోన్ నెంబర్లు వారి దగ్గర వుంచాలి . అవసరం అయితే వెంటనే కాంటాక్ట్ చేయటం అలవాటు చేయాలి. కొన్ని హెల్ప్ లైన్ నెంబర్స్ వారి నోటికి వచ్చేలాగా ప్రాక్టీస్ చేయించాలి తెలియని వ్యక్తుల వల్ల ఎలా ఎలర్ట్ గా ఉండాలో ముందే చెప్పి వుంచాలి . వ్యక్తిగత వివరాలు కొత్త వాళ్ళకి చెప్పనీయకుండా ట్రయినింగ్ ఇవ్వాలి . తలుపులు జాగ్రత్తగానే వేసుకోవటం అపరిచితులు ఫోన్ చేస్తే ఇంట్లో ఒక్కళ్ళమే ఉన్నామని చెప్పవద్దని నేర్పాలి. ఇంట్లో వంటరిగా ఉంటే తీసుకోవలసిన జాగ్రత్తలు పిల్లలకు ఎప్పుడు చెపుతూనే ఉండాలి.

Leave a comment