Categories
సేంద్రీయ పద్దతిలో పెరటి తోటలో కూర తేలిగ్గా పెంచుకోగలిగింది వంకాయలు, బ్రింజల్ గా పిలిచే ఈ వంగ మొక్కలు కుండీల్లో ఒక్కదాన్లో రెండు,మూడు నాటుకోవచ్చు. కుండిల్లో ముందుగానే పశువుల ఎరువు ,పిండి ఎరువులు, మట్టి కలుపుకోవాలి. ఒక్కో కుండీలో ఒక్క పుదినా మొక్క బంతి మొక్కకు ఎండ సరిగ్గా తగలాలి. మట్టి పూర్తిగా పోడిబారి పోకుండా నీళ్ళు పోయాలి. అక్టోబర్,నవంబర్ నెలల్లో నాటుకుంటే నాటిన 40 ,50 రోజుల్లో చక్కగా కాయలు కాస్తాయి. కొన్ని కుండీలు ,బ్యాగ్ ల్లో కొద్దిపాటి కూరగాయలు పండించుకోగలిగినా మంచిదే.