Categories
ఇల్లు అద్దంలా ఉంటుంది కానీ అస్తమానం మూసి వుంచే అలవాటులో ఉన్నం కాబట్టి తలుపు తీయగానే ఎదో వాసన విసిగిస్తూ ఉంటుంది.దాల్చిన చెక్క ముక్కలు ఓవెన్ లో వేడిచేసి ఆవాసన ఇల్లంతా వ్యాపించేలా చేస్తే దురువాసన మటుమాయం అవుతుంది .వంట సోడా నిమ్మరసం కలిసి చిన్న గిన్నెలో పోసి మూలన పెడితే వాసనలు పోతాయి. వెనిగర్ చిన్న గిన్నెలో పోసి పెట్టచ్చు బొగ్గు ముక్కలు ఫ్రిజ్ లో,డబ్బా వున్న గదిలో పెడితే వాసనలు రావు. బ్లీచింగ్ పౌడర్ కలపిన వేడి నీరు పెంకుల్లో పోసేస్తే కూడా వాసనలు రావు. కార్పెట్ పైన నేలపైన పాలు పిల్లలు మూత్రం వాసనలు వస్తే బొరాక్స్ చల్లి ఎండకు క్లీన్ చేస్తే వాసనలు మాయం.