ఇంట్లోనుంచి ఏదైనా పనిగానీ లేదా ఈ నవలో కవితో రాసుకోవాలన్న ఒక పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ తయారుచేయాలన్న సరైన వాతావరణం ఉన్నట్లు కనిపించదు. అదే ఆఫీస్ అయితే అసిస్టెంట్స్ లేదా సహాయకులు కావాల్సినవి వేళకు అందిస్తారు. ఇంట్లో అదంతా కుదరదు. కప్పు కాఫీ కావాలన్నా లేచి పొయ్యి వెలిగించి మళ్ళీ వర్క్ మూడ్ లోకి రావాలంటే కష్టమే. అలాంటాప్పుడు ఒక గదిని పూర్తిగా ఆఫీస్ లాగా మార్చుకోవాలి. ముందే తినాల్సినవీ తాగాల్సినవీ అందుబాటులో పెట్టేసుకోవాలి. క్షణంలో వేడిచేయగలిగే కొన్ని ఎలక్ట్రానిక్ వస్తువులు కూడా అమర్చుకోవచ్చు. అచ్చం ఆఫీసులో లాగే మధ్యలో విరామం తీసుకోవాలి . అంటే ఫోన్ కబుర్లు ఎఫ్ బి చూడటం లాంటివి. ఆ పనిచేసే గదిలో ఆఫిసుల్లో లాగే మంచి వాసనా లోచ్చే పువ్వులు వినాలనిపిస్తే పాటలు సంగీతం వైన్ ఏర్పాట్లు నిర్ణీత వేళలకు అల్పాహారం భోజనం కాస్త శ్రమ అయినా అన్నీ ఆరేంజ్ చేయూస్కుంటే అసలు ఆ ఇంటి ఆఫీస్ కంటే ఎంతో హ్యాపీగా ఉంటుంది. ఒక రహస్యం ఏమిటంటే అక్కడ బాస్ అంటూ ఎవళ్ళూ ఉండరు. మనకి మనమే బాస్. ఏమంటారు ??
Categories