Categories
మెయిల్ సినిమాతో ప్రేక్షకులకు పరిచయం కావటం వాళ్ళ మెప్పు పొందటం అంతా ఏదో కలలాగా ఉంది.చిన్నప్పటి నుంచి యాక్టింగ్ పాటలు అన్నీ ఇష్టమే. టీవీ షో బేబీ సింగర్ 2 లో విజేతగా నిలిచాను. మా కాలేజి మిస్ హైదరాబాద్ కాంటెస్ట్ స్టాల్ లో విజేతగా వచ్చాను.అక్కడ నుంచి మోడలింగ్ యాక్టింగ్ అవకాశాలు వస్తున్నాయి. ఓ టీ టీ లో సినిమా సక్సెస్ ని ఇప్పుడు ఎంజాయ్ చేస్తున్నా అంటుంది గౌరీ ప్రియ రెడ్డి.మెయిల్ సినిమాలో ఒక్కసారిగా పేరు వచ్చింది ఆమెకు. ఇప్పటిదాకా ప్లానింగ్ ఏదీ లేదు అన్ని ఫ్లో లో అలా వెళ్ళి పోతున్నాయి ఇక ఎలాంటి అవకాశాలు వస్తాయో ఎదురుచూస్తున్నా అంటోంది గౌరీ ప్రియ రెడ్డి .