హైదరాబాద్ లో ఉద్యోగం చేస్తూ సాయంత్రాలు ష్యాషన్ డిజైనింగ్ లో శిక్షణ తీసుకొనే దాన్ని .ఆరెళ్ళ వయసులో తమిళ చిత్రం జీన్స్ లో ఐశ్వర్య రాయ్ ని చూశాక నేను సినిమా నటిని కావాలనుకొన్న అంటోంది ప్రియంకా జవాల్కర్. హైదరాబాద్ లోని బిక్షు యాక్టింగ్ స్కూల్లో కోర్స్ చేసిన ప్రియాంక ముందుగా షార్ట్ ఫిల్మ్ లో నటించింది. మహారాష్ట్ర మూలాలున్న ప్రియాంక అనంతపురంలో పెరిగింది. టాక్సీవాలా సినిమాలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాలో తన దుస్తులు తనే డిజైన్ చేసుకొంది. వృత్తిలో మెలుకువల అభ్యాసం కోసం అమెరికా వెళ్ళాను. అప్పుడు నాకు 21 సంవత్సరాలు ,ఆ సమయంలో ఎంచుకోవలసిన వృత్తిపట్ల కూడా స్పష్టత లేదు. మల్టీ నేషనల్ కంపెనీలో పనిచేసే దాన్ని.దాన్ని సీరియస్ గా తీసుకోలేదు. లఘు చిత్రాల్లో పేరు వచ్చాక నాకెరీర్ సినిమాలే అని నిర్ణయించుకున్నాను అంటోంది ప్రియాంకా జవాల్కార్.

Leave a comment