Categories
ఖరీదులోనూ క్వాలిటీలోనూ అస్సులు సంబంధం ఉండదు. కొత్తదనంతో ప్రత్యేకంగా కనిపించాలి అంతే అమ్మాయిల దృష్టిలో . మ్యాచింగ్ విషయంలో అంతులేని పట్టుదల డ్రెస్ కు సరిగ్గా అన్నీ బొట్టుతో సహా ఉంగరం ,గాజులు అన్నీ మ్యాచ్ అవ్వాలి. ఇప్పుడిక చెప్పులు, పర్సుల మ్యాచింగ్ వచ్చేసింది. అందమైన డిజైనర్ పర్సెస్ కి అదే డిజైనర్ లుక్ తో చెప్పులుండాలి. ఇవి ఏ వేడుకలకైనా స్పెషల్ .అందమైన డ్రెస్ తో పాటు ,లేదా చీరెతో పాటు ఒకే రకంగా అప్ డేట్ గా కనిపించే ,బ్యాగ్ ,చెప్పులు ఉంటే మామూలు అమ్మాయి కూడా రాంప్ వాక్ చేసే మోడల్ లాగా కనిపించటం ఖాయం.