Categories
కరోనా సమయంలో బయటకు వెళ్ళటం కష్టం కనుక ఇంట్లోనే కొన్ని ఫిట్ నెస్ టిప్స్ పాటిస్తే ఆరోగ్యంగా ఉత్సాహంగా ఉండవచ్చు.టీవీ చూస్తూనే చిన్నచిన్న బరువులు ఎత్తే వ్యాయామాలు చేయొచ్చు. కాసేపు ఇంట్లోనే అటు ఇటు నడవచ్చు.లిఫ్ట్ లేకుండా మెట్లు ఎక్కి దిగొచ్చు.పిల్లలతో ఆడటం కూడా ఎక్సర్ సైజ్ వంటిదే. కంప్యూటర్ ముందు వర్క్ చేయవలసి వస్తే చైర్ లో కూర్చో కుండా స్టెబిలిటీ బాల్ పైన కూర్చుంటే శరీరం బ్యాలెన్స్ డ్ గా ఉంటుంది.స్థిరమైన భంగిమలో ఉండటం అలవాటు అవుతోంది. సైకిల్ తొక్కడం వల్ల కూడా శరీరం ఫిట్ గా ఉంటుంది. ముఖ్యంగా రాత్రి డిన్నర్ అయ్యాక పది నిమిషాలు నడవటం అవసరం అలాగే కాసేపు లేచి నిలబడి పని చేసుకుంటూ ఉండటం అలవాటు చేసుకోవటం చాలా మంచిది.