తూర్పు గోదావరి జిల్లా తునికి సమీపంలో లోవలో వెలసిన క్షేత్రం తలుపులమ్మ.అగత్స్య మహర్షి ఈ ప్రదేశంలో తపస్సు చేసి ఆ లలితా దేవిని ఇక్కడ ప్రతిష్ఠ చేశారు అని భక్తులు కొలిచే అమ్మ.పచ్చని కొండల మధ్య లోయ లో నుండి వచ్చిన ఆ జగత్జనని స్వరూపం అమోఘం.క్రమంగా నానుడిలో లోయ లోవ గా మారింది.
పూర్వం ఒక యువతి ఇక్కడ సంచరిస్తూ ఉండేదట.పేరు లేని ఈ యువతి ఎవరికి సహాయం కావాలంటే ప్రత్యక్షమై సహాయపడేది.అందరికి తలలో నాలుకగా వ్యవహరించే దేవత మన తలుపులమ్మ తల్లి.
అమ్మ కి సోదరుడు పోతురాజు.చేతిలో త్రిశూలం,ఢమరుకం ధరించి ఉంటుంది.
ఆషాఢ మాసంలో మంగళవారం, శుక్రవారం ప్రత్యేక పూజలు, కుంకుమార్చనలు వైభవంగా జరుగుతాయి.శాకాంబరీ అవతారంలో మనకు దర్శనం ఇస్తారు.
ఇష్టమైన రంగులు:ఎరుపు, ఆకుపచ్చ
ఇష్టమైన పూలు: అన్ని రకాల పుష్పాలు అంగీకరించును.
నిత్య ప్రసాదం: కొబ్బరి,పండ్లు.
-తోలేటి వెంకట శిరీష