Categories
శ్రీ కృష్టు ని జీవిత కధలను వివరించే పిచ్ వాయ్ పెయింటింగ్స్ కు మూలం రాజస్థాన్ లోని నాధ్ ద్వారా అనే చిన్న పట్టణం . ఇవి 16వ శతాబ్ది నాటి వైష్టవ మతానికి చెందినవి . శ్రీకృష్ట భగవానుడి బాల్య రూపాన్ని గోడలకు వేలాడదీసే వాళ్ళు పిచ్ వాయ్ అంటే సంస్కృతం లో వెనుక వేలాడదీయటం అని అర్ధం . భారీ ఉత్సవాలు,విగ్రహ మూర్తుల అలంకారాలు ,దేవాలయ అలంకరణలు చూపిస్తూ ఆధ్యాత్మికతకు కళాత్మకత ను జోడించే పెయింటింగ్స్ ఇవి . భగవంతుడికి చేసే సాంప్రదాయ సేవలను బట్టి వస్త్రధారణ అలంకారాలు మారతాయి . పిచ్ వాయ్ కళాకారులు దీన్ని అత్యంత సునిశితంగా పరిశీలించి మరీ ఈ కృష్టుని చిత్రాలు గీశారు . ఇప్పుడు ఆధునిక జీవనానికి తగ్గట్టు ఈ పెయింటింగ్స్ మెటాలిక్ రంగుల ప్రేమ్ లు ఏర్పాటు చేస్తున్నారు .