Categories
నలభై ఏళ్ళు దాటాక మాత్రమే బి.పి, కొలెస్ట్రాల్ పరీక్షలు చేయించుకోవాలి అనే మాట ఇప్పుడు పాత బడిపోయింది. ఇరవై ఏళ్ళ అమ్మాయిలు కూడ కోన్ని పరిక్షలు చేయించుకోవాలి.18 ఏళ్ళు దాటినప్పటి నుండి ప్రతి రేండళ్ళకి ఆధిక రక్తపోటుకి సంబంధించిన పరీక్షలు చేయించుకోవాలి. కోలెస్ట్రాల్ టెస్ట్ 25 ఏళ్ళు వచ్చినప్పటి నుండి తప్పదు. ఇక లైంగిక జీవితం మొదలు పెట్టిన దగ్గర నుండి పాప్ స్మయిర్ పరీక్ష చేయించుకుంటూ ఉండాలి. రెండేళ్ళకొకసారి చేయించుకుంటే గర్భాశాయం ముఖ ద్వార క్యాన్సర్ కు అంచన వేయవచ్చు. రోమ్ము పరీక్ష 20 ఏళ్ళు వచ్చిన దగ్గర నుంచి ప్రతి ఏటా ఈ పరీక్ష చేయించుకోవాలి. ఇక 40 ఏళ్ళ దాటాక మమోగ్రామ్ చేస్తారు.