గర్భిణుల్లో రక్తహీనత 90 శాతం ఐరన్ లోపం వల్లనే అంటారు డాక్టర్లు. ఈ రక్త హీనత కారణంగానే అబార్షన్లు బిడ్డ సరిగా బరువు ఎదగకపోవటం జరుగుతోంది అంటారు. ఆహారం నుంచే ఐరన్ స్వాభావికంగా శరీరానికి అందాలంటే ఐరన్ శాతం అధికంగా ఉండే పదార్దాలు తీసుకోవాలి. తాజా ఆకుకూరలు నువ్వుల ఉండలు,గసగసాలు,అటుకులు,పల్లీపట్టీ బిన్స్ తాజా పండ్లు వంటివి గర్భం రాక ముందు నుంచే తీసుకొంటూ ఉండాలి. మాంసం,చేపలు అంజూర్ ఎండుఖర్జురామ్ వంటి డ్రై ఫ్రూట్స్ కూడా ఎక్కువ తినాలి. గర్భవతి నాలుగు నిండిన దగ్గర నుంచి పౌష్టికాహారం తో పాటు ఐరన్ ఫోలిక్ యాసిడ్ ఉన్న మాత్రలు డాక్టర్ల పర్యవేక్షణలో తీసుకోవాలి . పిల్లలు బలంగా ఎదిగితేనే ఒక ఆరోగ్యవంతమైన సమాజం ఏర్పడుతోంది తెలుగు రాష్టాల్లో అనీమియా కేసులు ఎక్కువే . గర్భవతుల్లో ఈ రక్త హీనత ఇటు తల్లికి బిడ్డకు ప్రమాదమే.

Leave a comment